బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అవమానకరంగా ఇందిరా గాంధీ పేరు ప్రస్తావించారని మండిపడ్డారు. రాకేష్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సభలో ఇందిరమ్మ పేరు ఎలా మాట్లాడుతారు తమాషా చేస్తున్నారా..? రాకేష్ రెడ్డి మాటలు రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సారా గురించి మాట్లాడేటప్పుడు ఇందిరమ్మ పేరు తీస్తారా..? అని మండిపడ్డారు.
మహిళలకు సంబంధించి అవమానకరంగా మాట్లాడారు.. ఇందిరమ్మ పేరు సారాకి సంబంధించి ప్రస్తావించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ మా దేవత.. వాజపేయి గారు ఇందిరమ్మ ఉక్కు మహిళా అన్నారు.. దేవత అన్నారని గుర్తుచేశారు. సభ్యుడికి ఇందిరమ్మ పేరు ప్రస్తావించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరం కోరుతున్నాం.. మా నాయకురాలు ఇందిరమ్మ అవమానించే విధంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలన్నారు.
ఇందిరమ్మ పేద ప్రజల గుండెల్లో ఉంది.. మీరు మహిళా సమాజాన్ని అవమానపరిచినట్టు.. మా ఆదర్శమూర్తి ఇందిరమ్మ.. ఎన్నో పథకాలకు ఆమె పేరు పెట్టుకున్నాం.. రాకేష్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.