అలా చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయండి..రవాణాశాఖ అధికారులకు పొన్నం కీలక ఆదేశాలు

రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణాశాఖ అధికారులతో కీలక జూమ్ సమావేశం నిర్వహించారు.

By -  Knakam Karthik
Published on : 3 Nov 2025 5:30 PM IST

Telangana, road accidents,  transport Minister Ponnam Prabhakar, transport department officials

అలా చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయండి..రవాణాశాఖ అధికారులకు పొన్నం కీలక ఆదేశాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణాశాఖ అధికారులతో కీలక జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి , జేటీసి లు , డీటీసీలు ,ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు డివైడర్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. వాహనాల స్పీడ్ లాక్ ఎంత వరకు అమలవుతున్నాయి చూడాలి.. దానిని బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ వేయాలి. రవాణా శాఖ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ సీరియస్‌గా, యాక్టివ్‌గా ఉండాలి. ఘటన జరిగినప్పుడు దాడులే కాదు నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలి. రవాణా శాఖ గౌరవాన్ని ప్రజల్లో ప్రభుత్వంలో పెంపొందించేలా ఉద్యోగులు పని చేయాలి. అందరూ ఎఫెక్టివ్ గా పని చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు..అని మంత్రి పొన్నం హెచ్చరించారు.

రవాణా శాఖ అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్డు ప్రమాదాలను కంట్రోల్ చేయవచ్చు. ప్రజలకు వేధింపులు లేకుండా రవాణా శాఖ నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. రవాణా శాఖ లో కొత్తగా వచ్చిన ఉద్యోగులకు సీనియర్లు సమన్వయం చేసుకుంటూ పని చేయాలి. టిప్పర్ లారీలు ఇసుక, డస్ట్ తీసుకెళ్లేటప్పుడు టార్పలిన్ కప్పుకొని తీసుకోవాలి. డీటీసీ ,ఆర్టీవో లు ఇతర రవాణా శాఖ అధికారులు ఒక్కో జిల్లాలో మూడు బృందాలుగా ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ధ్యానం తరలింపుకు ఉపయోగించే వాహనాలపై వేధింపులు వద్దు. కమర్షియల్ వాహనాలు , ప్రయాణికులను తరలించే వాహనాలు , మైన్స్ మినరల్స్ తరలించే వాహనాల్లో నిబంధనలు పాటించని వాహనాల్లో భారీ పెనాల్టీ తో పాటు కఠినచర్యలు తీసుకోవాలి..నిబంధనలు పాటించని స్లీపర్ బస్సులు అందులో కార్గో సరుకులు తరలించిన కఠినంగా వ్యవహరించాలి. స్కూల్ బస్ ఫిట్నెస్ , హైర్ బస్ ఫిట్నెస్ ,ట్రక్కులు ,టిప్పర్ లు లారీలు వాటి ఫిట్నెస్ ఫర్మిట్ లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. వచ్చే రోడ్ సేఫ్టీ మంత్ ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి.. దాని కన్నా ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలు చేయాలి..

Next Story