ప్రసాద్ ల్యాబ్స్‌లో 'పూలే'మూవీ వీక్షించిన తెలంగాణ మంత్రి పొన్నం

ప్రసాద్ ల్యాబ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు బీసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు నేతలు, ప్రముఖులు కలిసి సినిమాను వీక్షించారు.

By Knakam Karthik
Published on : 25 May 2025 4:01 PM IST

Telanagana, Minister Ponnam Prabhakar, Phule Movie

ప్రసాద్ ల్యాబ్స్‌లో 'పూలే'మూవీ వీక్షించిన తెలంగాణ మంత్రి పొన్నం

ప్ర‌ముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతి రావు ఫూలే, అతని భార్య సావిత్రి బాయి ఫూలే జీవిత చరిత్రల ఆధారంగా బాలీవుడ్‌లో ‘ఫూలే’ సినిమా రూపొందించిన విష‌యం తెలిసిందే. పూలే దంపతుల జీవితం వారి పోరాటాలు, సామాజిక సంస్కరణలు, వారు చేసిన కృషి తదితర అంశాలపై సినిమా ద్వారా చూపించారు. తాజాగా ఈ సినిమాను బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బీసీ నాయకులు వీక్షించారు. ప్రసాద్ ల్యాబ్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు బీసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు నేతలు, ప్రముఖులు కలిసి సినిమాను వీక్షించారు. సామాజానికి ఫూలే దంపతులు చేసిన కృషిని వారు కొనియాడారు. ఈ దంపతులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీసీ నేతలు పిలుపునిచ్చారు.

కాగా, అనంత్‌ మహాదేవన్‌ దర్శకత్వంలో ప్రముఖ నటులు ప్రతీక్‌ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రలలో ‘ఫూలే’ సినిమాను బాలివుడ్‌లో రూపొందించారు. మొదట ఈ చిత్రం ఏప్రిల్‌ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని వివాదాల కారణంగా లేట్‌గా విడుదల అయ్యింది. బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపించారని, కులవాదాన్ని ప్రోత్సహిస్తోందని బ్రాహ్మణ ఫెడరేషన్‌ అధ్య క్షుడు ఆనంద్‌ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో గతంలో సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో సెన్సార్ బోర్డు ద్వారా వారు ఆరోపించిన అభ్యంతర సీన్‌లను తొలగించి విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Next Story