వచ్చే నెల నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్: పొంగులేటి

వచ్చే నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తాం..అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

By Knakam Karthik
Published on : 12 May 2025 5:34 PM IST

Telangana, Slot Booking, Registrations, Minister Ponguleti Srinivasreddy

వచ్చే నెల నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్: పొంగులేటి

వచ్చే నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తాం..అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలన్న లక్ష్యంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను మరింత చేరువ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.

రెండో దశలో భాగంగా రాష్ట్రంలో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభమైంది మొదటి దశలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, రెండో దశలో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి పొంగులేటి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈరోజుతో 47 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఈ విధానం అమ‌లులోకి వ‌చ్చింది. వ‌చ్చేనెల‌లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమ‌లు చేస్ం.

రిజిస్ట్రేష‌న్‌కు వ‌చ్చి గంట‌ల త‌ర‌బ‌డి చెట్ల కింద నిరీక్షించి క్యూ లైన్ల‌లో నిల్చోనే ప‌రిస్దితికి అడ్డుక‌ట్ట వేసేందుకు, స‌మ‌యాన్ని ఆదా చేసేందుకు, పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకురావ‌డానికి ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లో క్యూలైన్ల‌కు గుడ్‌బై చెప్పే రోజులు వ‌స్తాయ‌ని ద‌ళారులు ప్ర‌మేయం కూడా ఉండ‌బోదు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా కేవ‌లం 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తి అవుతుండ‌డం ప‌ట్ల ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. రిజిస్ట్రేష‌న్ శాఖ అధికారిక వెబ్ సైట్ registration.telangana.gov.in స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏరోజు వీలుంటే ఆరోజు ఆ స‌మ‌యానికి వ‌చ్చి రిజిస్ట్రేష‌న్ చేయించుకునేలా స్లాట్ బుకింగ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, అలాగే సేవల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా ప్ర‌జ‌లు మెరుగైన సేవలు అందుతాయ‌ని అన్నారు. ప్ర‌జ‌ల సౌక‌ర్యార్ధం అవ‌స‌ర‌మైన చోట రిజిస్ట్రార్ల సంఖ్య‌కూడా పెంచుతున్నామ‌ని మంత్రి పొంగులేటి వివరించారు.

Next Story