డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్తారు: కేటీఆర్

మంచిర్యాల జిల్లా ఖానాపూర్‌లో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  17 Nov 2023 5:01 PM IST
minister ktr, telangana, elections,  khanapur,

డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్తారు: కేటీఆర్

మంచిర్యాల జిల్లా ఖానాపూర్‌లో మంత్రి కేటీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్‌ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేటీఆర్ ఆసక్తికర విషయం ఒకటి చెప్పారు. నీరు, కరెంటుతో పాటు అనే సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్‌ ప్రభుత్వం.. మాకేం చేస్తోందని తెలంగాణ ఆడబిడ్డలు అడుతున్నారని చెప్పారు. అత్తలకు పెన్షన్లు వస్తున్నాయి.. మరి మా సంగతి ఏంటని కోడళ్లు అడుగున్నారని అన్నారు. అందుకే డిసెంబర్‌ 3 తర్వాత కోడళ్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్తారని వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరి కోసం ఒక కొత్త పథకం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. దాని పేరు 'సౌభాగ్య లక్ష్మి' అనీ.. నెలకు రూ.3వేలు మీ ఖాతాల్లో వేస్తామన్నారు.

ఖానాపూర్‌లో బీఆర్ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న జాన్సన్‌కు కాదు.. కేసీఆర్‌కు వేస్తున్నామని అనుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పడితే వారి చేతుల్లో పెడతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వస్తున్నారని.. వారి అజెండా ఒక్కటే అన్నారు కేటీఆర్. ఎలాగైనా కేసీఆర్ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంత మంది వచ్చినా బీఆర్ఎస్‌ మాత్రం రాష్ట్ర ప్రజల మీదే భారం వేసి ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

కాంగ్రెస్‌ పాలన ఎలా ఉండేదో మనందరం చూశామని.. బీడీలు చేసే అక్కా చెళ్లెళ్లను కూడా పట్టించుకోలేదన్నారు. కేసీఆర్‌ అయ్యాకే రూ.2వేల పెన్షన్ ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చామన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ దవాకానాలంటే భయపడేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులను కేసీఆర్ సర్కార్ పూర్తిగా మార్చేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అందుకే అభివృద్ధి వైపు నిలబడాలని ప్రజలను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.

Next Story