ప్ర‌ధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్‌

Minister KTR makes satirical comments on PM Modi over fuel price hike.ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం అదేపనిగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2022 12:33 PM IST
ప్ర‌ధాని మోదీపై మంత్రి కేటీఆర్ సెటైర్‌

ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం అదేపనిగా పెంచుతుండడంపై ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యంగా స్పందించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం మార్చి 22 నుంచి ఇంధ‌న పెంపు ప్రారంభ‌మైంది. గ‌త 15 రోజుల్లో 13 సార్లు ఇంధ‌న ధ‌ర‌లు పెరిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు లీట‌ర్ పెట్రోల్‌, డీజిల్ పై రూ.11 వ‌ర‌కు పెరిగింది. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ ప్ర‌స్తావిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా మంగ‌ళ‌వారం ఉద‌యం ఓ ట్వీట్ చేశారు.

దేశంలో జీడీపీ దూసుకెళ్లడం లేదని ఎవరన్నారు? గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రోజూ పెంచుతూ.. జనాలకు దానిని ఒక అలవాటుగా మార్చినందుకు ప్రధాని మోదీగారికి ధన్యావాదాలు. ఇప్పుడు ఇదంతా ఈవీ(ఎలక్ట్రిక్ వాహనాలను)లను ప్రమోట్‌ చేసేందుకు మోదీగారు చేస్తున్న మాస్టర్‌ స్ట్రాటజీ అని బీజేపీలో మేధావులైన కొందరు నేతలు చెబుతున్నార‌ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం వర్సెస్‌ తెలంగాణ మధ్య వాడీవేడిగా విమర్శలు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేడు లోక్‌స‌భ‌లో ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో టీఆర్ఎస్‌ ఎంపీలు నినాదాల‌తో హోరెత్తించారు. అమాయ‌కులైన అన్న‌దాత‌ల‌ను ర‌క్షించండి.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల‌కు అన్యాయం చేయ‌కండి.. వ‌రి కొనుగోళ్ల కోసం నిర్ధిష్ట‌మైన విధానాన్ని ప్ర‌క‌టించండి.. అంటూ ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం రూపొందించాలని డిమాండ్ చేసింది. టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న నేప‌థ్యంలో స్పీక‌ర్ బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

Next Story