ములుగులో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో

By అంజి  Published on  7 Jun 2023 2:30 PM IST
Minister KTR , development works, Mulugu district

ములుగులో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. డిగ్రీ కళాశాల సమీపంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి, పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా పోలీసు కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ కార్యాలయ భవనాలు, మోడల్ బస్టాండ్ కాంప్లెక్స్, సేవాలాల్ భవనాలకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.

అనంతరం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ములుగు జిల్లా కేంద్రం నుంచి రామప్ప ఆలయానికి చేరుకుని రామప్ప చెరువు ఒడ్డున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకుని.. ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రూ.30 లక్షలతో నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీకి,రూ.15 లక్షలతో నిర్మించే సమాచార పౌరసంబంధాల శాఖ మీటింగ్‌ హాల్‌ పనులకు శంకుస్థాపనలు, జిల్లా కేంద్రంలో రూ.2కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి సాధన స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు.

Next Story