ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత ఏడాది ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  9 July 2023 1:49 PM IST
Minister KTR, Konapur, School, Kamareddy,

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత ఏడాది ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గతేడాది మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ఆ సందర్భంగా కోనాపూర్‌ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. తన నానమ్మ, దివంగత వెంకటమ్మ జ్ఞాపకార్థం ఆమె సొంతూరు కోనాపూర్‌లో సొంత ఖర్చులతో స్కూల్‌ కట్టిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన స్కూల్‌ కట్టించారు.

కామారెడ్డి నియోజకవర్గంలోని కోనాపూర్‌లో సొంత ఖర్చులతో స్కూల్‌ నిర్మిస్తానని గతేడాది మేలో మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేసి చెప్పారు. తన నానమ్మ వెంకటమ్మది అదే ఊరు కావడంతో.. ఆమె జ్ఞాపకార్థం స్కూల్‌ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అయితే.. తాజాగా స్కూల్‌ నిర్మాణం పూర్తి అయినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. స్కూల్‌ భవనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు. ఏడాది తిరిగేలోపే భవనం సిద్ధం కావడంతో కోనాపూర్‌ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్ని హంగులతో రూపుదిద్దుకున్న స్కూల్‌ కట్టిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. స్కూల్‌ను చూసి పైలోకంలో తన నానమ్మ తప్పకుండా కచ్చితంగా సంతోషిస్తానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా.. వారం రోజుల్లో తల్లి శోభమ్మతో కలిసి మంత్రి కేటీఆర్ స్కూల్‌ను ప్రారంభిస్తారని బీఆర్ఎస్‌ స్థానిక నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం స్కూల్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story