మంత్రి కేటీఆర్‌కు స్కోచ్ అవార్డు

M‌inister KTR gets skoch award.తెలంగాణ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రో అవార్డు ల‌భించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2021 12:05 PM GMT
మంత్రి కేటీఆర్‌కు స్కోచ్ అవార్డు

తెలంగాణ రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రో అవార్డు ల‌భించింది. దేశంలోనే ఉత్త‌మ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిగా కేటీఆర్‌ నిలిచారు. ఈ మేరకు స్కోచ్‌ గ్రూప్‌ మంత్రి కేటీఆర్‌ ప్రశంసాపత్రం అందించింది. 2020 సంవ‌త్స‌రంలో ఉత్త‌మ ప‌నితీరు క‌న‌బ‌రిచినందుకు బెస్ట్ ప‌ర్ఫార్మింగ్ ఐటీ మినిస్ట‌ర్ గా కేటీఆర్ ను ఎంపిక చేసిన‌ట్లు స్కోచ్ గ్రూప్ వెల్ల‌డించింది. అలాగే ప‌లు ఇన్నోవేటివ్‌, ఈ-గ‌వ‌ర్నెన్స్ ఇన్షియేటివ్ తో ప్ర‌త్యేక‌త చాటిన తెలంగాణ రాష్ట్రాన్ని 'ఈ-గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్ గా ఎంపిక చేసింది.


ఈ సందర్భంగా స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు ఐటీ సేవలను అందించడం కొనసాగించాలని చెప్పారు. కరోనా కాలంలో ఐటీ సేవలను విస్తృతంగా వినియోగించారని అభినందించారు. 2016లో ఒకసారి మళ్లీ ఇప్పుడు రెండుసార్లు అవార్డు పొందడం అభినందనీయమని కేటీఆర్‌కు సందేశం పంపించారు. ఈ అవార్డును ఐటీశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ కేటీఆర్‌కు అంద‌జేశారు. రాష్ట్రానికి రెండు అవార్డులు ద‌క్క‌డం ప‌ట్ల కేటీఆర్ సంతోషం వ్య‌క్తం చేశారు.
Next Story
Share it