అంశాల స్వామి ఇక లేరు.. మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Minister KTR condolence on the death of Amshala Swami.ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంశాల స్వామి పేరు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2023 4:57 AM GMT
అంశాల స్వామి ఇక లేరు.. మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంశాల స్వామి పేరు తెలియని వారు ఉండ‌రు. చిన్న‌త‌నంలోనే ఫ్లోరైడ్ బారిన ప‌డిన ఆయ‌న ఈ ర‌క్క‌సిని త‌రిమికొట్టాల‌ని సుదీర్ఘ పోరాటం చేశారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడిగా గ‌త 32 సంవ‌త్స‌రాలుగా అనేక అంశాల‌పై పోరాడాడు. బాధితుల త‌రుపున త‌న గ‌ళం గ‌ట్టిగా వినిపించిన అంశాల స్వామి ఇక లేరు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న క‌న్నుమూశారు.

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని శివ‌న్న‌గూడెం గ్రామానికి చెందిన అంశాల స్వామి శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌మాద‌వ‌శాత్తు ట్రై సైకిల్ పై నుంచి కింద ప‌డ‌డంతో త‌ల‌కు బ‌ల‌మైన గాయ‌మైంది. శ‌నివారం ఉద‌యం ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించారు. ఈ విష‌యం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

"అంశాల స్వామి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి. అతను ఫ్లోరోసిస్ బాధితుల కోసం పోరాడిన పోరాట యోధుడు. చాలా మందికి ప్రేరణ. అతను ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి." అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

అంశాల స్వామి సొంతింటి క‌ల‌కు మంత్రి కేటీఆర్ సాయం చేశారు. గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మానికి హాజ‌రైయ్యారు. భ‌విష్య‌త్తులోనూ అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా క‌ల్పించారు. ఆ సంద‌ర్భంగా దిగిన ఫోటోను మంత్రి షేర్ చేస్తూ మృతుడి కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు.

Next Story