ఆస్క్ కేటీఆర్.. హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించడం లేదు..?
Minister KTR answers to netizens questions in Ask KTR program.తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో
By తోట వంశీ కుమార్ Published on 8 May 2022 7:52 AM GMTతెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విట్టర్ వేదికగా.. ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నెటీజన్లు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఎందుకు నిర్వహించడం లేదని ఓ నెటిజన్ ను అడుగగా.. మంత్రి కేటీఆర్ ఇలా సమధానం ఇచ్చారు. ఈ విషయాన్ని గంగూలీ, జైషా ను అడగాలని పేర్కొన్నారు.
Ask Jay Shah and Ganguly https://t.co/JBpnaDneNP
— KTR (@KTRTRS) May 8, 2022
పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి భారీగా నిధులు కేటాయించామని తెలిపారు. ఆరోగ్య రంగంలో మౌళిక వసతులు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా మూడు టిమ్స్ ఆస్పత్రులను నిర్మించినట్లు మంత్రి తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక కర్ణాటకలో సీఎం పదవి అమ్మకం వార్తలు బీజేపీ నిజస్వరూపమన్నారు.
Real face of BJP https://t.co/ztN2MQPKS6
— KTR (@KTRTRS) May 8, 2022
అలానే వచ్చే ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదంతో మళ్లీ గెలిచి ప్రగతిని కొనసాగిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రజల ఆస్తులను అమ్ముకుంటోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రాలు కలిసికట్టుగా కేంద్రంపై ప్రజాస్వామ్యంగా పోరాడాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం ఏమీ ఇవ్వదన్నారు. ఆదిలాబాద్ బీడీఎస్‌టీ ల్యాబ్‌ను జులైలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ వెలుపలకు కూడా విస్తరించారా..? అని ఓ నెటీజన్ అడుగగా.. భవిష్యత్తులో ఏం జరగాల్సి ఉందో ఎవరికి తెలుసు అని మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.