మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ (వీడియో)

బొలెరోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

By Srikanth Gundamalla
Published on : 30 April 2024 5:58 PM IST

minister konda surekha, help, accident, victims ,

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ (వీడియో)

రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. కొందరు ఈ ప్రమాదాల్లో గాయాలపాలు అవుతుంటే.. ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నతప్పిదాల వల్ల జీవితాలను కోల్పోతున్నారు. తాజాగా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వంగపల్లి మోటకొండూర్‌ వెళ్లే దారిలో అండర్‌ పాస్‌ బ్రిడ్జి దగ్గర రోడ్డు బొలేరో వాహనం బోల్తా పడింది. మితిమీరిన వేగంతో రావడంతో అదుపుతప్పి ఈప్రమాదం చోటుచేసుకుంది.

కాగా.. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అదే రూట్లో మంత్రి కొండా సురేఖ వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకు మంగళవారం బయలుదేరిన ఆమె మార్గమధ్యంలో ఈ ప్రమాదాన్నిచూశారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపారు. గాయపడ్డ వారికి సహాయం అందించారు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ వచ్చి.. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు దగ్గరే ఉన్నారు మంత్రి కొండా సురేఖ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మంత్రి కొండా సురేఖను అభినందిస్తున్నారు.


Next Story