కృష్ణమోహన్‌ పార్టీ మార్పు అవాస్తవం: మంత్రి జూపల్లి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తన మనసు మార్చుకున్నట్టు సమాచారం.

By అంజి
Published on : 1 Aug 2024 10:35 AM IST

Minister Jupalli Krishnarao, Gadwal MLA Bandla Krishnamohan Reddy, Telangana

కృష్ణమోహన్‌ పార్టీ మార్పు అవాస్తవం: మంత్రి జూపల్లి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి తన మనసు మార్చుకున్నట్టు సమాచారం. మళ్లీ సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్‌యంలోనే గద్వాల ఎమ్మెల్యే ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డితో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు.

ఆయనతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృష్ణమోహన్‌ బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరారని, కేటీఆర్‌ను ఆయన స్నేహపూర్వకంగా కలిశారని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారనే వార్తల్లో నిజం లేదన్నారు. ఎమ్మెల్యే కోరినట్టు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కృష్ణమోహన్‌తో కలిసి ఈ రోజు అసెంబ్లీకి వెళ్తున్నారం అని చెప్పుకొచ్చారు.

Next Story