దేశంలో కరోనా రోజువారి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వైధ్యాధికారులతో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బూస్టర్ డోసుల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని వైద్య అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ దేశంలో వేగం పుంజుకుంటోందని, పోర్త్ వేవ్‌కు చేరువలో ఉన్నామా అన్నట్లు భయాన్ని కలిగిస్తోంది. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో గత 24 గంటల్లో 600కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు డీఎమ్‌హెచ్ఓలతో సమీక్ష నిర్వహించి బూస్టర్ డోసులు ఇచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.