నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి హరీశ్‌రావు
Minister Harish rao says notification for 50000 posts soon.తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా.. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వయోపరిమితి పెంపు బిల్లును గురువారం సభ ఆమోదించింది. దాంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛను పెంపు బిల్లుకూ తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.
కనీస పింఛను రూ.50 వేలు, గరిష్ఠ ఫించను రూ.70 వేలకు పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల వైద్య ఖర్చుల సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లుకూ సభ ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుతో కొత్త ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నష్టం లేదన్నారు. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. మెరుగైన ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు 62ఏళ్లుగా ఉందన్నారు. త్వరలోనే 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు.