Siddipet: పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు.. పరిహారం అందజేస్తామని హామీ

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తన పంట నష్టం జరిగింది. తాజాగా సిద్దిపేట

By అంజి  Published on  26 April 2023 4:30 AM GMT
Minister Harish Rao, Siddipet , crop loss, Telangana

Siddipet: పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు.. పరిహారం అందజేస్తామని హామీ

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తన పంట నష్టం జరిగింది. తాజాగా సిద్దిపేట జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం జిల్లాలో జరిగిన పంట నష్టంపై పరిశీలన పర్యటనకు వెళ్లిన మంత్రి.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకువెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి.. యుద్ధప్రాతిపదికన పంటనష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం త్వరగా విడుదల చేసేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం బక్రిచెప్యాల గ్రామంలో పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఎంత మేరకు నష్టం వాటిల్లింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి వెంట ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం వివరాలను మే 1వ తేదీలోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం నాడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్య కార్యదర్శి.. నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలని కోరారు.

Next Story