రాబోయే ఎన్నికల్లో మీరు మాజీలే : అమిత్ షాకు హరీశ్ రావు కౌంట‌ర్‌

ఖ‌మ్మం స‌భ‌లో అమిత్ షా కామెంట్స్ పై మంత్రి హరీశ్ రావు స్పందించారు.

By Medi Samrat  Published on  27 Aug 2023 9:30 PM IST
రాబోయే ఎన్నికల్లో మీరు మాజీలే : అమిత్ షాకు హరీశ్ రావు కౌంట‌ర్‌

ఖ‌మ్మం స‌భ‌లో అమిత్ షా కామెంట్స్ పై మంత్రి హరీశ్ రావు స్పందించారు. మాకు నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బిజెపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని అన్నారు. బ్యాట్ సరిగా పట్టడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంద‌ని ఎద్దేవా చేశారు.

పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా.. రైతు బాంధవుడైన కేసీఆర్ ను విమర్శించేదని మండిప‌డ్డారు. 2జీ 3జీ 4జీ కాదు, కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది. రాబోయే ఎన్నికల్లో మీరు మాజీ లే అని అన్నారు. సీఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ లేని యోధుడు కేసీఆర్ అని కొనియాడారు. అబద్ధపు విమర్శలు.. అవుట్ డేటెడ్ ఆరోపణలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో హోం మంత్రి స్కిట్ ఉంద‌ని ఎద్దేవా చేశారు.

Next Story