వంద ఎలుక‌లు తిన్న పిల్లి తాను శాఖ‌హారి అన్న‌ట్లు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంకు మంత్రి హ‌రీశ్ కౌంట‌ర్‌

Minister Harish Rao counter attack on MP CM Shivraj Singh Chouhan.తెలంగాణ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jan 2022 9:12 AM GMT
వంద ఎలుక‌లు తిన్న పిల్లి తాను శాఖ‌హారి అన్న‌ట్లు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంకు మంత్రి హ‌రీశ్ కౌంట‌ర్‌

తెలంగాణ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు కౌంట‌ర్ ఇచ్చారు. సిద్దిపేట‌లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. దొడ్డిదారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి సీఎం అయ్యావు అంటూ చౌహాన్ పై మండి ప‌డ్డారు. శివ‌రాజ్ సింగ్ మాట‌లు విటుంటుంటే వంద ఎలుక‌ల‌ను తిన్న పిల్లి తాను శాఖా హారి అని అన్న‌ట్లు ఉంద‌న్నారు. టీఆర్ఎస్‌ను, సీఎం కేసీఆర్‌ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు ఆయ‌న‌కు లేద‌న్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి అయినప్ప‌టికీ శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ సాధించింది ఏమీలేద‌న్నారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి మ‌ధ్య ప్ర‌దేశ్‌తో పోలిక లేద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్ర‌స్థానంలో ఉంద‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అయితే.. మీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు‌ సమాధానంగా చెప్పారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

మ‌రీ మ‌ధ్యప్ర‌దేశ్‌లో జ‌రిగిన వ్యాపం కుంభ‌కోణం సంగ‌తి ఏంటి..? ఎవ‌రికైనా శిక్ష ప‌డిందా..? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఇక 317 జీవో రద్దు చేయాలా.. అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలా..? అని మండిపడ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం 14 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నిచారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌గా నోటిఫికేష‌న్లు ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే.. బీజేపీ అడ్డుకుంటోంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు ఆరోపించారు.

Next Story
Share it