తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కుతున్నారు: హరీశ్‌రావు

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  19 Sep 2023 12:30 PM GMT
Minister Harish Rao,  PM Modi, Parliament, Congress,

తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కుతున్నారు: హరీశ్‌రావు

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ, విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని ప్రధాని మోదీ అన్నారని.. మోదీ కడుపులో ఉన్న విషాన్ని మరోసారి బయటకు వెళ్లగక్కారని అన్నారు హరీశ్‌రావు. తెలంగాణ ఏర్పడగానే మోదీ ఈ రాష్ట్రానికి మోసం చేశారు. రాత్రికి రాత్రే తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపింది మోదీ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీకి ఎప్పుడూ ప్రేమ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను మొదట్నుంచే మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టును ఏపీకి తీసుకెళ్లారని.. బీజేపీ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలే అని మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేకపోయారు అని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం చేసి.. పైగా విమర్శలు చేస్తారా అని హరీశ్‌రావు మండిపడ్డారు.

కాంగ్రెస్ నాయకులపైనా మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ హామీలిచ్చిన కాంగ్రెస్‌.. తాము అధికారంలో ఉన్న కర్ణాటకలో వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కర్ణాటకలో ఆస్పత్రులు బాగా లేవని సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణకు వచ్చి చికిత్స చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ఆర్నెళ్లకో ముఖ్యమంత్రి మారతాడని అన్నారు. ఆ పార్టీ నేతలు మంచినీళ్లు తాగాలన్నా దిల్లీకి పరుగెత్తుతారని విమర్శించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్లు ఎంతకైనా దిగజరుతారు.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినవి అన్ని బోగస్ మాటలు.. వాళ్ళని నమ్ముకుంటే మన బతుకు ఆగమే.. ఎలాగో తెలంగాణలో అధికారంలోకి రామని చెప్పి లేని పోనీ మాటలు చెబుతున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Next Story