మంత్రి ఈట‌ల వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డానికి కార‌ణ‌మిదే..

Minister Etela Rajender about Covid Vaccination.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2021 7:38 AM GMT
మంత్రి ఈట‌ల వ్యాక్సిన్ తీసుకోక‌పోవ‌డానికి కార‌ణ‌మిదే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రిలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్ క‌లిసి ప్రారంభించారు. మొద‌టి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణ‌మ్మకు వేశారు. అనంత‌రం ఈటల మీడియాతో మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. ప్రారంభంలో ప్ర‌తి కేంద్రంలో 30 మందికి మాత్ర‌మే టీకాలు వేస్తామ‌న్నారు. వ్యాక్సిన్ కోసం ఎవ‌రూ తొంద‌ర ప‌డొద్దు అని సూచించారు. ప్రాధాన్య‌క్ర‌మంలో అంద‌రికీ కొవిడ్ టీకాలు ఇస్తామ‌న్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నిరంతర ప్రక్రియగా వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. క‌రోనా వ్యాక్సినేషన్‌పై కొందరు అనుమాలను వ్యక్తం చేయడంతో వారిలో ఉన్న భయాన్ని పొగెట్టేందుకు నేనే తొలి టీకా వేయించుకుంటానంటూ మంత్రి ఈటల రాజేందర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. తాను ఈ రోజు వ్యాక్సిన్‌ ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పుకొచ్చారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనా పై యుద్ధం చేస్తున్నారని గుర్తుచేసిన ఈటల.. ప్రాణ త్యాగం కూడా చేశారన్నారు. వారిని గుర్తు చేసుకొని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. వారికి ముందు వాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారు. అందుకే మొదటి వాక్సిన్ సఫాయి కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చామని.. అందుకే నేను ఈ రోజు వాక్సిన్ తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చారు.
Next Story
Share it