గాలి మాటలు.. అబద్ధపు ఆరోపణలు కాదు రాజకీయం అంటే..

ప్రతిపక్షం మూసీ నీ రాజకీయం చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  19 Oct 2024 3:50 AM GMT
గాలి మాటలు.. అబద్ధపు ఆరోపణలు కాదు రాజకీయం అంటే..

ప్రతిపక్షం మూసీని రాజకీయం చేస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మూసీని కాపాడుకునే చిత్తశుద్ధి, కమిట్మెంట్ ప్రభుత్వాలకు ఉండాలన్నారు. చెరువులు,నదులను కాపాడే భాధ్యత మనందరిపై ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రకృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్ఛారు.

మూసీకి ప్రాజెక్టు లో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. R&R ప్యాకేజ్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మున్సిపల్ శాఖ తీసుకున్న నిర్ణయాలు ఇవి.. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి డైరెక్షన్ మినెట్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు దానినే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పక్కన జీవించే ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగదు.. దీనికి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీ.. మూసీని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు.

ఓవర్ నైట్ డెవలప్మెంట్ సాధ్యం కాదు..మూసీ నిర్వాసితులకు ఇలాంటి నష్టం జరగనివ్వం అని హమీ ఇచ్ఛారు. పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత.. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మూసీ ప్రాజెక్టు కొత్తది కాదు అన్నారు.14 గ్రామాల మల్లన్న సాగర్ లో మునిగిపోయాయి. భూ నిర్వాసితుల కు ఏం న్యాయం చేశారన్నారు. మీరు తెచ్చిన భూసేకరణ చట్టాలను కోర్టు కొట్టివేసిందన్నారు. యూపీఏ సర్కార్ 2013 లో సమగ్ర భూసేకరణ చట్టం తెస్తే అమలు చేయలేదు.. జీవో నెంబర్ 123 తెచ్చారు.. ప్రజలు అప్పటి ప్రభుత్వం పై తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. కోర్టుకు వెళ్లి జీవో 123ను రద్దు చేయించుకున్నారు. మూసీ నిర్వాసితులకు రీహబిటేషన్ చేస్తాం అని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు పూర్తిగా ఖండిస్తున్నాం.. అందరినీ ఆదుకుంటాం.. ప్రకృతిని కాపాడుకుంటాం అన్నారు. గాలి మాటలు.. అబద్ధపు ఆరోపణలు ఇవి కాదు రాజకీయం అంటే.. తొమ్మిదిన్నర ఏళ్లలో రియల్ ఎస్టేట్ ఎలా సాగిందో తెలుసు... కార్పొరేషన్ లు ఎలా ఏర్పాటు చేసి రుణాలు ఎలా తీసుకున్నారో తెలుసు అని గత బిఆర్ఎస్ పాలనపై ఫైర్ అయ్యారు.

Next Story