మెట్రో రైల్ కు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలి: రేవంత్ రెడ్డి

Metro Rail should be named after Jaipal Reddy. హైదరాబాద్ కు మణిహారమైన మెట్రో రైల్ కు స్వర్గీయ జైపాల్ రెడ్డి పెరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు

By Medi Samrat  Published on  30 Sep 2022 9:15 AM GMT
మెట్రో రైల్ కు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలి: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కు మణిహారమైన మెట్రో రైల్ కు స్వర్గీయ జైపాల్ రెడ్డి పెరు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ కు మెట్రో రైలు మాంజూరు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అరుదని, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు జైపాల్ రెడ్డి అని ఆయన కొనియాడారు. ఢీల్లీకి వెళ్లినా ఆయన ఈ ప్రాంత సమస్యల విషయంలో రాజీ పడలేదన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని మొట్టమొదట కృషి చేసింది జైపాల్ రెడ్డి అని తెలిపారు. డెబ్బయ్యో దశకంలోనే మారుమూల పల్లెలకు కరెంటును తీసుకొచ్చి పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిన వ్యక్తి అని ఆయన చెప్పారు.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ఆయనది

ఎవరినీ విమర్శించకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమని, అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత జైపాల్ రెడ్డిదని రేవంత్ అన్నారు. అలాంటి ఆయనకు తాము బంధువులమని తేలిపారు. తాము ఆయన రాజకీయ వారసులం కాదని... పార్టీలకు అతీతంగా ఆయనకు రాజకీయ వారసులు ఉన్నారని తెలిపారు. ఆయన ఎంతో మంది నాయకులను తయారు చేశారన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో దివంగత ప్రధాని పీవీ విగ్రహం ఏర్పాటు చేసినట్లే.. చివరి వరకు రాజకీయాల్లో విలువలకు కట్టుబడిన నాయకుడి జైపాల్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


Next Story