హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొండుతున్న వేళ.. పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులు, తీవ్రగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయని తెలిపింది.
ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే నేడు నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల పాటు కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.