అమరావతి: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. మెగా డీఎస్సీ - 2025కి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 15తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే నెల 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు గత ఏడాది నవంబులో డీఎస్సీ సిలబస్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
కాగా రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష ఏడేళ్ల తర్వాత జరుగుతుండటం గమనార్హం. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, సిలబస్, అప్లికేషన్ లింక్, రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తిస్థాయిలో ఖాళీలు వంటి పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/లో ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో వీటిని నిర్వహిస్తారు. అటు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ఇస్తోంది.