'నువ్వు ఎవనివో నాకు తెల్వదు'.. మీమ్‌ స్టార్‌ గద్వాల్ బిడ్డ కన్నుమూత

Meem star Mallikarjun eyelid. అందరి జీవితాల్లో సోషల్‌ మీడియా అనేది ఒక భాగమైపోయింది. ఇంటర్‌నెట్‌, సోషల్‌ మీడియా లేకుండా మనిషి జీవితం ఒక్క

By అంజి  Published on  7 Feb 2022 3:49 AM GMT
నువ్వు ఎవనివో నాకు తెల్వదు.. మీమ్‌ స్టార్‌ గద్వాల్ బిడ్డ కన్నుమూత

అందరి జీవితాల్లో సోషల్‌ మీడియా అనేది ఒక భాగమైపోయింది. ఇంటర్‌నెట్‌, సోషల్‌ మీడియా లేకుండా మనిషి జీవితం ఒక్క రోజు కూడా గడవటం కష్టంగా మారింది. ఇక సోషల్‌మీడియా ట్రెండ్‌లోకి వచ్చిన తర్వాత.. అందులో బాగా దగ్గరైనవి మీమ్స్‌. మీమ్స్‌తో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలుగా మారారు. అయితే అలానే పాపులర్‌ అయిన 'గద్వాల్‌ బిడ్డ' కన్నుమూశాడనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 'నువ్వెనివో నాకు తెల్వదు..' అంటూ కోట్లాది మందికి పరిచయం అయిన ఆ చిన్నారి ఇక లేడనే వార్త మీమ్స్‌ ప్రేమికులందరికి షాక్‌ ఇచ్చింది. పాపులర్‌ కావలంటే ఒక స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. అయితే అలా పాపులర్‌ కాకపోయినా.. మీమ్స్‌కు మాత్రం కంటెంగ్‌గా నిలుస్తారు. దాంతో ఆటోమేటిక్‌ పాపులారిటీ కూడా పెరుగుతుంది.

ఇలా పాపులర్‌ అయినవాళ్లలో ఒకరు చిన్నారి 'గద్వాల్‌ బిడ్డ'. కొన్నేళ్ల కిందట దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ప్రకటించిన ఓ టైటిల్‌ దుమారం చెలరేగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గద్వాల్‌ బిడ్డ చేసిన వీడియో అప్పట్లో తెగవైరల్‌ అయ్యింది. తనను గద్వాల్‌ బిడ్డగా పరిచయం చేసుకున్న ఆ చిన్నారి.. ఆర్జీవి ప్రకటించిన టైటిల్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేశాడు. ఆ సమయంలో దళితులను కించపర్చేలా వ్యవహరించాడంటూ దళిత కమ్యూనిటీలు ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మైనర్‌ కావడంతో పోలీసుల సమక్షంలో అతనితో క్షమాపణలు చెప్పించారు. కాగా ఆ సమయంలో అతని సంభాషణలు, ఏడుపు సైతం వైరల్‌గా మారింది.

అప్పటి నుండి కాస్తా సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న.. అతని వీడియోలు మాత్రం మీమ్స్‌ క్రియేటర్లకు పని కల్పించాయి. మీమ్స్‌ టెంప్లేట్‌, స్టిక్కర్స్‌, ట్రోల్‌ వీడియోల్లో వైరల్‌ అయ్యాడు. అయితే మీమ్స్‌ స్టార్‌ మృతిచెందిన వార్త.. ఇప్పుడు సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. గద్వాల్‌బిడ్డ అసలు పేరు మల్లికార్జున్‌రెడ్డి అని సమాచారం. ఇటీవల ఆ చిన్నారి ఓ సినిమాలో నటించాడు. అతడు ఆస్తమాతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని సౌత్‌ ఇండియన్‌ థగ్స్‌ అనే పేజీ నుండి మెసేజ్‌ వైరల్‌ అయ్యింది. మల్లికార్జున్‌ స్వగ్రామం జోగులాంబ గద్వాల్‌ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె. ఇవాళ మల్లికార్జున్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

Next Story