మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం

Medaram Sammakka Saralamma mini fair arrangements are complete. రెండు సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఎంతో అంగరంగ

By అంజి  Published on  24 Jan 2023 5:56 AM GMT
మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం

రెండు సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఎంతో అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతర కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆసియా ఖండంలోనే ఇది అతి పెద్ద గిరిజన జాతర. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అసలు జాతర ఇప్పటికే పూర్తి అయిపోయింది. కాగా ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర జరగనుంది. ఈ మినీ జాతరను సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

సమ్మక్క సారలమ్మ ఇష్టమైన మఘశుద్ధ పౌర్ణమి జరుపుకొని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఈ జాతరను నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కాగా జారత ఏర్పాట్లు సమీక్ష చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం మేడారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లను మంత్రి సమీక్షిస్తూ.. ఏళ్లుగా జాతరకు భక్తుల తాకిడి పెరిగిందన్నారు. భక్తుల సంఖ్య నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంటుందని రాథోడ్ తెలిపారు.

ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. రక్షిత మంచినీటి సరఫరాతో పాటు వాష్‌రూమ్‌లు, దుస్తులు మార్చుకునే గదులను శానిటైజ్ చేయాలని ఆమె అధికారులకు చెప్పారు. అలాగే కొండాయి, ఐలాపూర్, బయ్యక్కపేట్ గ్రామాల్లో జరిగే మినీ జాతరల్లో సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వ్యర్థాల తొలగింపుపై చర్చించేందుకు గొర్రెలు, పౌల్ట్రీ కోళ్ల వ్యాపారులతో సమావేశం కావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జంపన్నవాగు (వాగు)ను సందర్శించిన అనంతరం రాథోడ్‌ మాట్లాడుతూ.. పగిడిద్ద భవన్‌, గోవిందరాజుల భవన్‌, భక్తుల విశ్రాంతి గదుల్లో సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. నాలుగు రోజుల మినీ జాతర ఫిబ్రవరి 1, 2023 నుండి ప్రారంభమవుతుంది.

Next Story