మేడారం ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ గా తాడ్వాయి మండలానికి చెందిన ఇర్ప సుకన్య సునీల్ దొర ప్రమాణ స్వీకారం చేశారు. చైర్ పర్సన్ తో పాటు 15 మంది డైరెక్టర్లతో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క ప్రమాణ స్వీకారం చేయించారు. జాతర పూర్తయ్యేంత వరకే ట్రస్ట్ బోర్డు ఉనికిలో ఉంటుంది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ మధ్య జరిగే జాతర ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసింది.
మేడారంలో కేబినెట్ మీటింగ్..
మరో వైపు రాష్ట్ర చరిత్రలోనే క్యాబినెట్ మీటింగ్ ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వెలుపల జరుగుతున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ నెల 18న మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనున్నది. ఆ రోజు సాయంత్రం క్యాబినెట్ భేటీ జరిగిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రాత్రి బస కూడా అక్కడే చేస్తారు. మరుసటి రోజున లాంఛనంగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రారంభించి హైదరాబాద్ చేరుకుంటారు.