Medak: రెండు లారీలు ఢీకొని.. నలుగురు దుర్మరణం
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 Jun 2024 7:20 AM ISTMedak: రెండు లారీలు ఢీకొని.. నలుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. నిర్లక్ష్యం.. మద్యం మత్తులో వాహనాలు నడపడం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద చోటుచేసుకుంది. బైపాస్ వద్ద ముందు ఉన్న లారీని వెనకాల నుంచి మరో లారీ వచ్చి వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. లారీ వేగంగా వస్తుండటం వల్ల ప్రమాదతీవ్రత పెరిగింది. ఈ ప్రమాదంలో వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టిన లారీలో నలుగురు దుర్మరణం చెందారు. క్యాబిన్‌లో కూర్చొవడంతో అందులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి స్థానికులు, ఇతర వాహనదారులతో సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మృతదేహాలను లారీ క్యాబిన్ నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.