విషాదం.. కొడుకు మరణవార్త విని గుండెపోటుతో తల్లి మృతి

మెదక్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  6 Jan 2024 8:02 AM GMT
medak, mother,  son, died,   heart attack,

 విషాదం.. కొడుకు మరణవార్త విని గుండెపోటుతో తల్లి మృతి

మెదక్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హవేలిఘన్‌పూర్‌ మండలం కుచన్‌పల్లిలో గుండెపోటుతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. కొడుకు మరణవార్తను తెలుసుకున్న తల్లి కూడా ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. ఆమెను పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

కుచన్పల్లికి చెందిన నరసింహగౌడ్‌ (36) కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున అతనికి గుండెపోటు వచ్చింది. దాంతో.. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు నరసింహగౌడ్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో జాయిన్‌ చేసుకన్న వైద్యులు అతడిని బతికించేందుకు ప్రయత్నించారు. కానీ లాభం లేకుండా పోయింది. చివరకు నరసింహగౌడ్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. నరసింహగౌడ్‌కు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. అతను మృతిచెందడంతో విషాదచాయలు అలుముకున్నాయి.

కాగా.. కాసేపటికే నరసింహగౌడ్ కన్నతల్లి ఆస్పత్రికి వచ్చింది. కొడుక్కి ఏమైందో తెలుసుకునేందుకు లోపలికి వెళ్లింది. అయితే.. కొడుకు ప్రాణాలతో లేడు అనే విషయం తన చెవిన పడింది. దాంతో.. ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. గుండె బరువెక్కింది. ఉన్నట్లుండి ఆమె కూడా కుప్పకూలిపోయింది. వెంటనే వైద్యులు పరిశీలించారు. కానీ.. ఆమె కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెప్పారు. అయితే.. కొడుకు.. గంటల వ్యవధిలోనే తల్లి కూడా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు ముంచెత్తాయి.


Next Story