ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోన్న సాహిల్ చౌదరి (19) హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన సాహిల్ చౌదరిగా పోలీసులు గుర్తించారు . బుధవారం ఉదయం సాహిల్ గదిలో ఒక్కడే ఉన్నట్లు సమాచారం. గదిలో ఉండే తోటు విద్యార్థులు వచ్చి సాహిల్‌ను పిలిచినా పలకకపోవడంతో తలుపు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకీ తలుపులు తెరుచుకోకపోవడంతో పగలగొట్టి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
వెంటనే తోటి విద్యార్థులు అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే సాహిల్ చౌదరి మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి అధ్యాపక సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. కాగా ఆగస్టు 2న ఎంబీబీఎస్ సెకండియర్ క్లాసుల జరగడానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.