గుడ్‌న్యూస్‌.. డిపెండెంట్‌ ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచారు.

By అంజి  Published on  11 Jun 2024 6:34 AM IST
Age Limit, Singareni, Dependent Job, Telangana

గుడ్‌న్యూస్‌.. డిపెండెంట్‌ ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు

సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సోమవారం నాడు సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లుగా ఉండగా, కార్మిక సంఘాల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నది. విధి నిర్వహణలో కార్మికుడు మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌కు గురైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు బదిలీ వర్కర్లుగా ఉద్యోగాలు కల్పిస్తారు. కాగా డిపెండెంట్‌ ఉద్యోగాల వయసు పెంపుపై సీఎం రేవంత్‌ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది.

సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమం​పై ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. సంక్షేమంలో భాగంగా కార్మికులకు, వారి కుటుంబాలకు విద్య, వైద్యం, వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. కార్మికుల శ్రేయస్సు కోసం కొత్త ప్రపోజల్స్​ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ప్రమాదంలో గాయపడిన, మృతిచెందిన కార్మికులను, వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.కోటి ప్రత్యేక బీమా సదుపాయాన్ని కల్పించగా మరిన్ని సౌలతులు కల్పించేందుకు సిద్ధమవుతోంది.

Next Story