నిమ్స్‌లో భారీగా పెరిగిన ఆర్థోపెడిక్ సర్జరీలు: 2023లో రికార్డు ఆపరేషన్లు
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లోని ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ కు రోగులు క్యూ కడుతున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Feb 2024 8:15 AM GMTనిమ్స్‌లో భారీగా పెరిగిన ఆర్థోపెడిక్ సర్జరీలు: 2023లో రికార్డు ఆపరేషన్లు
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లోని ఆర్థోపెడిక్ డిపార్ట్‌మెంట్ కు రోగులు క్యూ కడుతున్నారు. కీళ్ల మార్పిడి, పలు సమస్యల బారిన పడిన రోగులు ఆసుపత్రికి వచ్చేస్తూ ఉన్నారు. "ఒకప్పుడు సంవత్సరానికి సగటున 75 నుండి 80 సర్జరీలు జరుగుతూ ఉండేవి.. మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు గత సంవత్సరంలో 470కు చేరుకున్నాయి" అని నిమ్స్‌లోని ఆర్థోపెడిక్ విభాగం అధిపతి డాక్టర్ నగేష్ అన్నారు.
నిమ్స్‌లో జాయింట్ రీప్లేస్‌మెంట్‌లను కోరుకునే రోగులు భారీగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ నుండి మంచి ప్రయోజనం పొందుతుంది. ప్రభుత్వ-ప్రైవేట్ ఆసుపత్రులలో ఖర్చును పరిశీలించినా నిమ్స్ లో వైద్యం చేయించుకోడానికే రోగులు మొగ్గుచూపుతూ ఉన్నారు. డాక్టర్ నగేష్ మాట్లాడుతూ, “నిమ్స్‌లో జాయింట్ రీప్లేస్‌మెంట్‌లను కోరుకునే రోగులకు చాలా తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ప్రైవేట్ ఆసుపత్రులలో ఒక్కో నీ రీప్లేస్ మెంట్ సర్జరీకి రూ. 2.5 లక్షల నుండి రూ. 5 లక్షల మధ్య ఖర్చు అవుతుంది, నిమ్స్‌లో మరింత పొదుపుగా రూ. 1.5 లక్షలతో పూర్తీ చేయవచ్చు. ” అని తెలిపారు. "ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలి మార్పిడి ఖర్చు రూ. 65,000 కాగా.. ప్రైవేట్ రంగంలో నాలుగు రెట్లు ఎక్కువ," అన్నారాయన.
AIIMS ఆర్థోపెడిక్స్ విభాగం అధిపతి డాక్టర్ రాజేష్ మల్హోత్రా మాట్లాడుతూ, "భారతదేశంలో ప్రతి సంవత్సరం 2.5 లక్షల మందికి పైగా మొత్తం మోకాలి మార్పిడి (TKR) చేయించుకుంటున్నారు.. ఐదేళ్ల క్రితం ఏటా నిర్వహించిన సర్జరీల కంటే 2.5 రెట్లు ఎక్కువ." అని అన్నారు.
రోగ నిర్ధారణ, చికిత్సా విధానంలో మార్పులు:
ఖర్చు ప్రభావం కాస్త ఉన్నప్పటికీ.. శస్త్రచికిత్సకు ముందు, శస్త్రచికిత్స అనంతర సంరక్షణలో ప్రమాణాలు గొప్పగా లేకపోవడం గురించి కూడా ఆందోళనలు కలుగుతూ ఉన్నాయి. శస్త్రచికిత్స అనంతర ఫాలో-అప్, వ్యక్తిగత సంరక్షణలో మెరుగుదల అవసరమని డాక్టర్ నగేష్ అంగీకరించారు. ఇక ప్రభుత్వం నిమ్స్‌కు ప్రైవేట్ బీమాను కూడా అందిస్తే, కార్పొరేట్ వైపు రోగులు చూడరని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిమ్స్: ఆర్థోపెడిక్ స్పెషాలిటీలకు కేంద్రం
నిమ్స్ వివిధ ఆర్థోపెడిక్ స్పెషాలిటీలకు కేంద్రంగా మారింది. డాక్టర్ నగేష్ కాంప్లెక్స్ స్కోలియోటిక్ సర్జరీలలో గొప్పగా పని చేస్తున్నామని తెలిపారు. "NIMS అత్యధిక సంఖ్యలో కాంప్లికేటెడ్ స్కోలియాటిక్ (scoliotic) శస్త్రచికిత్సలను నిర్వహించింది. ఇందులో ఆర్థో-ఆంకాలజీ కేసులకు సంబంధించి అవయవాల సంరక్షణ శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి."
నిమ్స్‌లో శస్త్రచికిత్సల ఖర్చు-ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది, “90 శాతం కేసులు ఆరోగ్యశ్రీ తెలంగాణ, CMRF (ముఖ్యమంత్రి సహాయ నిధి) కింద అదనపు ఖర్చు లేకుండా జరిగాయి." అని నగేష్ తెలిపారు. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. నిమ్స్‌లో మెరుగైన సౌకర్యాలను కల్పించారని, ఇందులో ఆపరేషన్ థియేటర్‌లు, వార్డులలో మెరుగైన వాతావరణం, శస్త్రచికిత్స అనంతర ICU గదులు ఉన్నాయని డాక్టర్ నగేష్ తెలిపారు.