ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు హతం

ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఏదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్టు తెలిసింది.

By అంజి  Published on  1 Dec 2024 3:51 AM GMT
encounter, Mulugu district , Maoists killed

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు హతం

ములుగు జిల్లా ఏటూరునాగారంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఏదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్టు తెలిసింది. తెలంగాణ గ్రేహౌండ్స్‌, యాంటీ మావోయిస్ట్‌ స్క్వాడ్‌ జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేత బద్రు సహా ఇతరులు ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా పోలీసుల నుంచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గత నెల 22న ఛత్తీస్‌గఢ్‌లోని భెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు చనిపోయారు. యాంటీ నక్సల్స్‌ ఆరేషన్‌లో భాగంగా కుంటా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10 మంది మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్‌ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Next Story