హైడ్రాలో జరిగిన పరిణామం టీ కప్పులో తుఫాన్ లాంటిది: రంగనాథ్
తనాలు తగ్గించి ఇచ్చిన జీవోపై మార్షల్స్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చలు జరిపారు
By Knakam Karthik
హైడ్రాలో జరిగిన పరిణామం టీ కప్పులో తుఫాన్ లాంటిది: రంగనాథ్
హైదరాబాద్: జీతాలు తగ్గించారంటూ హైడ్రాలో పని చేస్తున్న మార్షల్స్ విధులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వేతనాలు తగ్గించి ఇచ్చిన జీవోపై మార్షల్స్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రాలో ఈరోజు జరిగిన పరిణామం టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఎక్కడా హైడ్రా సేవలు నిలిచిపోలేదు. మార్షల్ శాలరీస్ విషయంలో ఎక్కడా తగ్గింపు చర్యలు తీసుకోలేదు. వారికి గతంలో ఇచ్చినట్టుగానే శాలరీలు ఇస్తాం. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జీవోలో వేతనాలు తగ్గిస్తున్నట్టుగా ఇచ్చిన మాట వాస్తవమే... అందులో మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కార్పొరేషన్ ద్వారా వారికి తగిన వేతనాలు చెల్లిస్తాం..అని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు.
కాగా హైడ్రాలో పని చేస్తున్న కొంతమందికి ఈ జీవో ద్వారా వేతనాలు తగ్గాయి, మరి కొంతమందికి పెరిగాయి. తగ్గిన వారు ఆందోళన చెందారు. వారికి ఎక్కడా వేతనాలు తగ్గించడం లేదని స్పష్టం చేశాం. ఫీల్డ్‌లో వాళ్లకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఆ సమస్యలను పరిష్కరిస్తాం. వర్షాలు పడ్డప్పుడు పని భారం ఉంటుంది మిగతా సమయంలో వారికి పని తక్కువగా ఉంటుంది. మార్షల్‌తో ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. హైడ్రా ఒక ప్రత్యేకమైన విధి విధానాలతో వచ్చిన సంస్థ ఇక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది..అని రంగనాథ్ పేర్కొన్నారు.