మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. 2026 జనవరి 1న సాయుధ పోరాటం ఆపేస్తామని మావోయిస్టు ప్రకటించింది.
By - అంజి |
మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన
సీపీఐ మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. 2026 జనవరి 1న సాయుధ పోరాటం ఆపేస్తామని మావోయిస్టు ప్రకటించింది. ఆ రోజు అందరం లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేసింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత సమయం కావాలని కేంద్రానికి ఇటీవల కొంత సమయం కావాలని కేంద్రానికి ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీ బలహీనమైంది. మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా మావోయిస్టు ప్రకటనలో అనంత్, తాను, తన సహచరులు ప్రభుత్వం చేపట్టిన ‘పూనా మార్గెం’ ప్రచారాన్ని అంగీకరిస్తున్నట్టు తెలిపారు. ఒక్కొక్కరుగా లొంగిపోవడం కంటే, సమూహంగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. అలాగే పరస్పర సమన్వయం, సంప్రదింపుల కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ నంబర్‌ను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. తమకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఎదుట లొంగిపోతామని స్పష్టం చేశారు.
“ఆయుధాలు వదులుకోవడం ప్రజలకు ద్రోహం చేయడం కాదు. ఇది సంఘర్షణకు సరైన సమయం కాదు. ఆయుధాలు ఒక ముగింపు, ఒక మార్గం కాదు” అని అనంత్ ప్రకటనలో పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీలో ఈ నిర్ణయం ప్రాముఖ్యంగా మార్పులకు దారితీసే అవకాశముందని సెక్యూరిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.