మన్యంకొండ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద రొప్‌వే సేవలు
Manyamkonda to become first temple in Telangana to get ropeway service.మన్యంకొండ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే
By తోట వంశీ కుమార్ Published on 31 Jan 2023 9:11 AM ISTతెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మన్యంకొండ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రోప్ వే సేవలు అందించాలని ప్రభుత్వం బావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగే రాష్ట్రంలో రోప్ వే సేవతో కూడిన తొలి దేవాలయంగా మన్యంకొండ వేంకటేశ్వరస్వామి ఆలయం నిలవనుంది.
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం, మన్యంకొండ, చారిత్రాత్మకమైన భోంగీర్ కోట, దుర్గం చెరువులో కేబుల్ కార్ సేవలను ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పర్యాటక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పర్యాటక శాఖ అధికారులను ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధ్యాసాథ్యాలను అధికారులు పరిశీలించారు.
ఈ క్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. కొండ పుణ్యక్షేత్రం వద్ద పనులను చేపట్టేందుకు, రోపింగ్ కోసం ఓ ఏజెన్సీ టెండర్ వేసింది.
యాత్రికుల సౌకర్యార్థం ఆలయంలో అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను శాఖ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమం కింద ఆలయం వద్ద రోప్‌వేను ప్రతిపాదించారు. ఇది మోనో కేబుల్ రివర్సిబుల్ జిగ్ బ్యాక్ ఎనిమిది-సీటర్ క్యాబిన్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. వాలు పొడవు దాదాపు 725 మీటర్లు ఉంటుంది. ఎగువ మరియు దిగువన రెండు టెర్మినల్స్‌లో ఒక్కొక్కటి మూడు క్యాబిన్‌లతో ఆరు క్యాబిన్‌లు ఉంటాయి.
దిగువ టెర్మినల్ పాయింట్ (LTP) పంప్ హౌస్ సమీపంలో ప్రతిపాదించగా, ఎగువ టెర్మినల్ పాయింట్ (UTP) కొండపై పెద్ద సైన్ బోర్డు క్రింద ఏటవాలుగా ఉన్న రాతిపై ఏర్పాటు చేయనున్నారు. క్యాబిన్‌లు పూర్తిగా వెంటిలేషన్, ఆటోమేటిక్‌గా పనిచేసే తలుపులతో తయారు చేయబడ్డాయి.
రూ.20 కోట్లతో రోప్‌వేను ప్రతిపాదించారు. ఇది కాకుండా, ఆలయంలో మరిన్ని వసతి సౌకర్యాలు, వాహనాల పార్కింగ్ స్థలం మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులను ప్లాన్ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సీనియర్ అధికారి చెప్పారు.
నేటి నుంచి వార్షిక బ్రహోత్సవాలు..
మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఒక ప్రసిద్ధ దేవాలయం. మహబూబ్ నగర్ పట్టణం నుండి 18 కి.మీ దూరంలో ఉంది. దిగువ నుండి కొండపైకి నాలుగు కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డు ఉంది. అంతేకాకుండా కొండపైకి చేరుకోవడానికి 365 మెట్లు ఉన్నాయి. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ రెండు మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఉపయోగించుకోవచ్చు.
నేటి(జనవరి 31) నుంచి వార్షిక బ్రహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. ఫిబ్రవరి 5న రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సారి బ్రహోత్సవాల్లో సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.