తెలంగాణలో ఏసీబీ పంజా..రూ.16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు

By -  Knakam Karthik
Published on : 20 Feb 2026 9:50 PM IST

Telangana, Peddapalli District, ACB Trapped, Corruption, Manthani, Sub Registrar, AntiCorruptionBureau

తెలంగాణలో ఏసీబీ పంజా..రూ.16,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. కన్నూరి బాపు అనే రైతు ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ రూ. 35 వేలు డిమాండ్ చేయగా, చివరకు రూ. 16,500కు ఒప్పందం కుదిరింది. బాధిత రైతు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ.. డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా ఆ లంచం డబ్బులు తీసుకుంటుండగా రాజేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి నగదును సీజ్ చేశారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా అవినీతిపై నిఘా పెంచిన ఏసీబీ అధికారులు, ఈ రోజు మరికొన్ని చోట్ల కూడా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ విభాగాల్లో బాధితుల ఫిర్యాదుల మేరకు దాడులు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఒక పని కోసం రూ. 5,000 లంచం డిమాండ్ చేయగా, ఆ డబ్బులు తీసుకుంటున్న సమయంలో ముగ్గురు కోర్టు సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకే రోజు అటు రిజిస్ట్రేషన్ శాఖలో, ఇటు కోర్టు సిబ్బందిపై ఏసీబీ దాడులు జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులు పక్కా ప్లాన్‌తో ఈ అవినీతి తిమింగలాలను చిక్కించుకున్నారు.

Next Story