తెలంగాణ ప్రజల గుండెల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్థానం శాశ్వతం అని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంతో ఆయనది విడదీయలేని బంధమని పేర్కొన్నారు. దేశ యువతకు ఆయన ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఆయనపై ఏ పార్టీ నేతలకూ దురభిప్రాయం లేదన్నారు. మన్మోహన్ సింగ్ పదవులకే వన్నె తీసుకొచ్చారన్నారు. మన్మోహన్‌కు గుర్తుగా ఫక్షర్త్ సిటీలో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. దేశ నిర్మాణం కోసం మన్మోహన్ సింగ్ ఎన్నో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని సీఎం రేవంత్ వెల్లడించారు. ఉపాధి హామీ, ఆర్టీఐ, ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్, ఆధార్‌ను ఆయన ప్రారంభించారని తెలిపారు.
2013లో భూసేకరణ చట్టం తెచ్చి నిరుపేదలను, 2006లో అటవీ హక్కుల చట్టానికి సవరణలు చేసి ఆదివాసీలను ఆదుకున్నారని కొనియాడారు. ఐటీ రంగంలో ప్రస్తుతం దేశం శాసించగలుగుతోందంటే మన్మోహన్ విధానాలే కారణమన్నారు. అటు మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇచ్చేందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపాలని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీర్మానానికి బీఆర్‌ఎస్ మద్ధతు ఇస్తున్నట్టు అసెంబ్లీలో కేటీఆర్ తెలిపారు. ఆ అవార్డు పొందేందుకు మన్మోహన్ సింగ్ పూర్తిగా అర్హులని అన్నారు. మన్మోహన్ సామర్థ్యాన్ని గుర్తించింది తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు అని చెప్పారు. ఆయన పీఎంగా ఉన్న సమయంలోనే కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా పని చేసినట్టు గుర్తు చేశారు.