అకాల వర్షాలు: మామిడి పండ్ల ధరలు పెరిగే ఛాన్స్
హైదరాబాద్‌లోని మామిడి ప్రియులకు పండ్లలో రారాజుగా భావించే మామిడి పండ్లు ఈ సీజన్‌లో ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది.
By అంజి Published on 20 March 2023 9:45 AM GMTఅకాల వర్షాలు: మామిడి పండ్ల ధరలు పెరిగే ఛాన్స్
హైదరాబాద్‌లోని మామిడి ప్రియులకు పండ్లలో రారాజుగా భావించే మామిడి పండ్లు ఈ సీజన్‌లో ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. దీని వెనుక కారణం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అనేక మామిడి పంటలను ప్రభావితం చేసిన అకాల వర్షాలు, తెగుళ్ళ దాడి, ఫలితంగా వాటి దిగుబడికి రెట్టింపు దెబ్బ తగిలింది. అకాల వర్షాలు, వడగళ్ల వానలు మామిడి పంటను మాత్రమే కాకుండా.. మొక్కజొన్న, బొప్పాయి, ఉల్లి, పత్తి, టమోటా, మిరప వంటి ఇతర పంటలను కూడా ప్రభావితం చేశాయి. దీంతో దిగుబడికి నష్టం వాటిల్లిందని, దీని ప్రభావం తమ జీవనోపాధిపై పడుతుందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో వర్షాలు మామిడి రైతుల కష్టాలను పెంచుతున్నాయి
జనవరి నుండి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో సీజన్ సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, వర్షాలు, వడగండ్ల వానలతో పాటు తెగుళ్ళ దాడి పంటలపై ప్రభావం చూపింది. తెగుళ్ళ దాడుల కారణంగా పువ్వు-పండు మార్పిడి కూడా ప్రభావితమైంది. ఫలితంగా మామిడి తక్కువ దిగుబడి వచ్చింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగళ్ల వానలు రైతుల కష్టాలను మరింత పెంచాయి. దీంతో ఈ సీజన్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలు, తెగుళ్ల దాడుల వల్ల పంటలు నష్టపోవడం ఎగుమతి మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతుంది. ఇది సరఫరా తగ్గడానికి, ధరల పెరుగుదలకు దారితీస్తుంది. తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో మొత్తం మామిడి ఉత్పత్తిలో, గణనీయమైన భాగం గల్ఫ్ దేశాలు, చైనా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతుంది.
హైదరాబాద్ మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి మామిడి కాయలు
సాధారణంగా హైదరాబాద్ మార్కెట్‌లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పచ్చి మామిడి పండ్లను తెస్తారని, అయితే ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్‌కు పచ్చి మామిడి పండ్లను తీసుకురావడంతో ధరలు పెరిగాయి. బెంగళూరుతోపాటు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి మామిడి పండ్లను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు.