సీజేఐపై దాడికి నిరసనగా చలో ఢిల్లీకి మంద కృష్ణ పిలుపు..ఎప్పుడంటే?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 17న హలో దళిత చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
By - Knakam Karthik |
సీజేఐపై దాడికి నిరసనగా చలో ఢిల్లీకి మంద కృష్ణ పిలుపు..ఎప్పుడంటే?
హైదరాబాద్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ మీద జరిగిన దాడికి నిరసనగా ఈ నెల 17న హలో దళిత చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మంద కృష్ణ మీడియాతో మాట్లాడుతూ..సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ గవాయ్ మీద దాడి చేసి నెల రోజులు అవుతుంది. రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థపై జరిగిన దాడి 140 కోట్ల ప్రజలు ఖండించారు. ఇప్పటి వరకు దాడి చేసిన వ్యక్తి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ విఫలమైంది. మూడు వ్యవస్థలు పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మానవహక్కుల కమిషన్ విపలమైనట్లు అర్థం అవుతుంది. సుప్రీంకోర్టులో పోలీసు స్టేషన్ ఉంటుంది కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల17న చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నాం. ఆత్మగౌరవంగా జీవించాలని అనుకుంటున్న దళితులందరు చలో ఢిల్లీ రావాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే అందరూ చలో డిల్లికి రావాలని కోరుతున్నాం. ఇంతవరకు మానవహక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది..అని మంద కృష్ణ పేర్కొన్నారు.
తెలంగాణలో వామనరావు రావు దంపతుల హత్యపై మానవ హక్కుల కమిషన్ సుమోటో గా కేసు నమోదు చేసింది. రౌడీ షీటర్ ఎన్ కౌంటర్ పై సుమోటో గా కేసు నమోదు చేసింది. కానీ గవాయ్‌పై డాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయలేదు.? న్యాయ వ్యవస్థలో దళితులైన న్యాయ మూర్తులకు అవమానాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి జరిగితే దళితులకు న్యాయం జరగట్లేదని అర్థం అవుతుంది.
రాజ్యాంగాన్ని గౌరవించే వాల్లే నిజమైన దేశ భక్తులు. ఒక నాడు ప్రజా సమస్యలపై పోరాటం చేసే నక్సలైట్లే నిజమైన దేశ భక్తులు అనుకున్నాం. కానీ రాజ్యాంగం, చట్టాల మీద గౌరవం ఉన్నవాళ్ళందరు దేశ భక్తులు. అవమానించేవాళ్ళు అందరూ దేశ ద్రోహులే. దేశ భక్తులకు,దేశ ద్రోహులకు మద్య గీత గీయాల్సిందే. పాకిస్థాన్ జిందాబాద్ అనేవాళ్ళు మాత్రమే దేశ ద్రోహులు కాదు. రాజ్యాంగాన్ని అవమానించే వాళ్ళు కూడా దేశ ద్రోహులే..అని మందకృష్ణ అన్నారు.