Medak: రంగులు చ‌ల్లాడ‌ని.. పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు

హోళీ పండుగ జరుపుకుంటున్న అంజయ్య అనే వ్యక్తిపై మరో వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని రేగోడ పోలీసులు మంగళవారం తెలిపారు.

By అంజి  Published on  8 March 2023 10:45 AM IST
Marpally , Holi festival, Medak district

Medak: రంగులు చ‌ల్లాడ‌ని.. పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు

హోళీ పండుగ వేళ మెదక్ జిల్లా మర్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఉత్సాహంగా ఆడాల్సిన హోలీ కాస్త గొడవకు దారి తీసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ పెద్దదయ్యింది. హోళీ పండుగ జరుపుకుంటున్న అంజయ్య అనే వ్యక్తిపై మరో వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని రేగోడ పోలీసులు మంగళవారం తెలిపారు. మధ్యాహ్నం బాధితుడు బి. అంజయ్య తన స్నేహితులు, బంధువులతో కలిసి హోళీ జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ షబ్బీర్‌పై అంజయ్య రంగులు విసిరాడు.

షబ్బీర్ తన ద్విచక్ర వాహనంలో ఉన్న బాటిల్‌లో పెట్రోల్‌ నింపి, బాటిల్‌ను అంజయ్యపై పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. భుజాలు, చేతులు తీవ్రంగా కాలిన అంజయ్యను గ్రామస్థులు రక్షించారు. గ్రామస్థులు రేగోడ పోలీసులకు సమాచారం అందించి అంజయ్యను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి గాంధీ ఆస్పత్రికి తరలించి క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చేర్పించారు. అంజయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు షబ్బీర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడు షబ్బీర్ కు అంజయ్యకు మధ్య పాత కక్షలేవైనా ఉన్నాయా? లేక యాక్సిడెంటల్ గా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story