భార్యతో గొడవ.. భవనంపై నుంచి దూకి భర్త మృతి

Man jumps to death from building in Rajendranagar. రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్న సమస్యపై వాగ్వాదం జరగడంతో

By అంజి  Published on  7 Feb 2023 7:07 AM GMT
భార్యతో గొడవ.. భవనంపై నుంచి దూకి భర్త మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్న సమస్యపై వాగ్వాదం జరగడంతో ఆవేశంతో వ్యక్తి పైకప్పుపైకి వెళ్లి దూకి చనిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం.. రేవన్ సిద్దప్పగా గుర్తించబడిన వ్యక్తి, అతని భార్య ఏదో చిన్న సమస్యపై గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే సిద్దప్ప భవనం పైకప్పుపైకి దూకాడ. గాయపడిన ఆ వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నార్సింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి బాలానగర్‌లోని తన ఇంట్లో 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలానగర్ పాత గ్రామంలో సాయి కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. "సోమవారం ఉదయం సాయి కుమార్ తల్లి ఏదో సమస్యపై అతన్ని మందలించింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి అతను ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతను డిప్రెషన్‌లోకి జారిపోయి ఉండవచ్చు" అని బాలానగర్ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సోమవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని తన ఇంట్లో 10వ తరగతి విద్యార్థిని ఉరి వేసుకుని కనిపించింది. మార్కులు తక్కువ వచ్చినందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఆరెల్లి జాగృతి(16) ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి ఆమె శవమై కనిపించింది. జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జాగృతి ఇటీవలి ప్రీ-ఫైనల్‌ పరీక్షల్లో సగటు కంటే తక్కువ పనితీరు కనబరిచారంటూ తల్లిదండ్రులు ఆమెను మందలించడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story