పోలీసుల అదుపులో సికింద్రాబాద్ అల్ల‌ర్ల సూత్రధారి..!

Man behind Secunderabad riots arrested.కేంద్ర‌ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీమ్‌కు వ్య‌తిరేకంగా దేశ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2022 7:45 AM GMT
పోలీసుల అదుపులో సికింద్రాబాద్ అల్ల‌ర్ల సూత్రధారి..!

కేంద్ర‌ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన అగ్నిప‌థ్ స్కీమ్‌కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. నిన్న‌(శుక్ర‌వారం) సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో అల్ల‌ర్లు చోటు చేసుకున్నాయి. దీని వెనుక కుట్ర కోణం ఉంద‌ని బావిస్తున్నారు. ఈ అల్ల‌ర్ల‌ను ప్రోత్సాహించార‌నే అభియోగాల‌పై ఆవుల సుబ్బారావు అనే వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసారావుపేటలో సాయి డిఫెన్స్‌ అకాడమీని నడుపుతున్నాడు సుబ్బారావు. త‌న సొంతూరు ఖ‌మ్మంలో ఉన్న సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు న‌ర‌స‌రావుపేట‌కు త‌ర‌లిస్తున్నారు.

ఇక సికింద్రాబాద్ అల్ల‌ర్ల కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 12 మంది ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. విధ్వంసం సృష్టించేలా ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను కొంద‌రు రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా వాట్సాప్స్ గ్రూప్‌ల‌లో అభ్య‌ర్థుల‌ను రెచ్చ‌గొట్టిన‌ట్లు ప్రాథ‌మికంగా తేల్చారు. 10 ప్రైవేటు డిఫెన్స్ అకాడ‌మీల‌కు చెందిన నిర‌స‌న‌కారులు ఇందులో పాల్గొన్న‌ట్లు గుర్తించారు.

Next Story
Share it