మమ్నూర్ ఎయిర్‌పోర్ట్‌ భూమి కోసం.. గ్రామస్తులను ఒప్పించిన మంత్రి కొండా సురేఖ

వరంగల్‌ ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు కార్గో సేవలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మామునూర్‌ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు.

By అంజి  Published on  8 Nov 2024 2:16 AM GMT
Mamnoor Airport, Minister Konda Surekha, Villagers, Land , Warangal

మమ్నూర్ ఎయిర్‌పోర్ట్‌ భూమి కోసం.. గ్రామస్తులను ఒప్పించిన మంత్రి కొండా సురేఖ

వరంగల్‌ ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు కార్గో సేవలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మామునూర్‌ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, నగర మేయర్‌ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్‌ సత్య శారదతో కలిసి మంత్రి వరంగల్‌లోని మమ్నూర్‌ ఎయిర్‌ఫీల్డ్‌ను గురువారం పరిశీలించారు. అనంతరం ఎయిర్‌పోర్టు కోసం 253 ఎకరాల సేకరణపై చర్చించేందుకు గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. విమానాశ్రయం వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో గ్రామస్థులకు వివరించారు.

వరంగల్ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని గుర్తించి వారి భూమి మార్కెట్ విలువ ఆధారంగా ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. పునరావాస కాలనీలో విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి సౌకర్యాలను కలిగి ఉండే ప్రధాన భూమిని కూడా ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తొలుత హైదరాబాద్‌కు 150 కి.మీ.లోపు కమర్షియల్‌ ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి మామ్‌నూర్‌లో ప్రాజెక్టుకు మద్దతుగా కేంద్రాన్ని , జీఎంఆర్‌ గ్రూప్‌ను విజయవంతంగా ఒప్పించారని ఆమె తెలిపారు.

Next Story