బర్రెలక్కకు మాజీమంత్రి రూ.లక్ష విరాళం

తెలంగాణ బర్రెలక్క (శిరీష) కు మద్దతుగా యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు విరాళంగా పంపించారు.

By అంజి  Published on  19 Nov 2023 4:05 AM GMT
malladi krishna rao,  telangana, barrelakka shirisha, Telangana Polls

బర్రెలక్కకు మాజీమంత్రి రూ.లక్ష విరాళం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు మద్దతుగా, ఆమెకు ఎన్నికల ప్రచారం కోసం యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయలు విరాళంగా పంపించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేస్తున్నారు. బర్రెలక్కతో ఫోనులో మాట్లాడి మల్లాడి కృష్ణారావు ఆమెకు అభినందనలు తెలిపారు.

''తెలంగాణ రాష్ట్ర కొల్లాపూర్ నియోజకవర్గ ఓటరు మహాశయులారా పేద కుటుంబం నుంచి వచ్చిన బర్రెలక్క శిరీష్‌కు ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి రాజకీయాలల్లో ప్రశ్నించే శిరీష లాంటి వాళ్లు ముందుకు వస్తే మీ భవిష్యత్తు మారుతుంది.. నీ గెలుపు నేను కోరుకుంటున్నాను. నీ ప్రచార ఖర్చుల కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. నీ గెలుపు నేను కోరుకుంటున్నాను. ఒక వేళ అపజయం కలిగితే కృంగిపోవద్దు. ఉన్నత చదువులు చదువుకుంటే ఆర్థిక సహాయం అందజేస్తా'' అని మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు.

శిరీష చేసిన ఓ వీడియో గతంలో నెట్టింట వైరల్ అయింది. డిగ్రీ చేసినా ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ చేసుకోవడం లేదు కాబట్టి, బర్రెలు కాస్తున్నానని, ఇంకొన్ని బర్రెలు కొనుక్కుని ఈ పని చేస్తానని ఆమె చెప్పిన వీడియో చాలా ఫేమస్ అయింది. అప్పటి నుంచి శిరీష బర్రెలక్కగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. దీంతో చాలా మంది యువత, ముఖ్యంగా నిరుద్యోగులు శిరీష వైపు మొగ్గు చూపుతున్నారు. ఆమె ప్రచారంలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా యువతలో బర్రెలక్క శిరీషకు క్రేజ్ ఉంది.

Next Story