తెలంగాణలో 30 మంది ఐపీఎస్‌ల బదిలీలు.. కొత్త పోస్టింగ్ ఎక్కడంటే
Major reshuffle in police department in Telangana.తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది. మొత్తం
By తోట వంశీ కుమార్ Published on 25 Dec 2021 8:16 AM ISTతెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది. మొత్తం 30 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇప్పటి వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీకుమార్‌ను అవినీతి నిరోధకశాఖ డీజీగా..ఇటీవలే కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సీవీ ఆనంద్‌ను ఆయన స్థానంలో హైదరాబాద్ సీపీగా నియమించింది. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్, ఏసీబీ డైరెక్టర్‌గా శిఖా గోయల్, నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి, సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా ఎన్.శ్వేత, హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీగా జోయల్ డెవిస్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్‌గా కార్తికేయ, మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని, సైబరాబాద్ క్రైం డీసీపీగా కమలేశ్వర్, సైబరాబాద్ జాయింట్ కమిషనర్‌గా అవినాష్ మొహంతి, హైదరాబాద్ ఉత్తర మండల డీసీపీగా చందనా దీప్తిల ను నియమించింది.
ఐపీఎస్ బదిలీలు.. కొత్త పోస్టింగ్‌లు ఎక్కడంటే
1. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
2. ఏసీబీ డీజీగా అంజనీ కుమార్
3. ఏసీబీ డైరెక్టర్ట్ గా శిఖా గోయల్
4.హైదరాబాద్ క్రైమ్స్ సంయుక్త కమిషనర్‌గా ఏఆర్ శ్రీనివాస్
5.ట్రాఫిక్ సంయుక్త కమిషనర్‌గా ఏవీ రంగనాథ్
6.నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరీ
7.సిద్దపేట కమిషనర్‌గా ఎన్ శ్వేత
8.హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీగా జోయెల్ డేవిస్
9.నిజామాబాద్ కమిషనర్‌గా కె.ఆర్.నాగరాజు
10.మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని
11.హైదరాబాద్ సంయుక్త కమిషనర్‌గా కార్తికేయ
12.నిర్మల్ ఎస్పీగా సీహెచ్ ప్రవీణ్‌కుమార్
13.ఆసిఫాబాద్ ఎస్పీగా కె.సురేశ్‌కుమార్
14.ఆదిలాబాద్ ఎస్పీగా మంచిర్యాల డీసీపీ డి.ఉదయ్‌కుమార్
15.వికారాబాద్ ఎస్పీగా ఎన్.కోటిరెడ్డి
16.హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి
17.మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్రపవార్
18.స్పెషల్‌బ్రాంచి సంయుక్త కమిషనర్‌గా పి.విశ్వప్రసాద్
19.హైదరాబాద్ డీసీపీ(డీడీ) గా డాక్టర్ గజరావ్ భూపాల్
20.హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా జి.చందనా దీప్తి
21.సంయుక్త కమిషనర్(పరిపాలన), సైబరాబాద్ గా అవినాశ్ మహంతి
22. డీసీపీ క్రైమ్స్(సైబరాబాద్)గా కల్మేశ్వర్ శింగెనవార్
23.నారాయణపేట ఎస్పీగా ఎన్.వెంకటేశ్వర్లు
24.జనగామ డీసీపీగా పి.సీతారాం
25.శంషాబాద్ డీసీపీగా ఆర్.జగదీశ్వర్ రెడ్డి
26.జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా జె.సురేందర్ రెడ్డి
27.కామారెడ్డి ఎస్పీగా బి.శ్రీనివాస్‌రెడ్డి
28.బాలానగర్ డీసీపీగా సుదీప్ గోనే
29.మాదాపూర్ జోన్ డీసీపీగా కె.శిల్పవల్లి
30.నాగర్ కర్నూల్ ఎస్పీగా కె.మనోహర్