అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలంగాణ యువతులు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కాలిఫోర్నియాలో కారులో ట్రిప్‌కు వెళ్తుండగా ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మరణించారు.
ఈ ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీ సేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతి చెందారు.
ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబాలతో పాటు ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.