ఆ తెలంగాణ‌ జిల్లాలు ఎడారిలా మారే పరిస్థితికి తీసుకువచ్చారు

Madhu Yashki Goud Fires On CM KCR. కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసి కష్టపడి సాధించుకున్న స్వరాష్ట్రంలో నిధులు, నియామకాలు, నీళ్

By Medi Samrat  Published on  30 Oct 2021 4:26 PM IST
ఆ తెలంగాణ‌ జిల్లాలు ఎడారిలా మారే పరిస్థితికి తీసుకువచ్చారు

కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసి కష్టపడి సాధించుకున్న స్వరాష్ట్రంలో నిధులు, నియామకాలు, నీళ్లు కూడా ప్రజలకు అందే పరిస్థితి లేదని టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ మ‌ధుయాష్కీ గౌడ్ అన్నారు. అయ్యా.. కొడుకుల అడ్డగోలు పాలనతో ఇప్పటికే దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిలా మారే పరిస్థితికి తీసుకువచ్చారని విమ‌ర్శ‌లు చేశారు. ఏపీ ప్రభుత్వం ఇష్టంవచ్చినట్లు కడుతున్న రాయలసీమ సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనుమతులు మంజూరైన పాలమూరు-రంగారెడ్డిని ప్రాజెక్టును కూడా నిర్వీర్యం చేసేలా ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపి సొంత ప్రజలపై కుట్రలు చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు మంజూరైన ప్రాజెక్టును రీ డిజైన్ల పేరుతో మార్చి.. పరిస్థితిని మొదటకు తీసుకువచ్చారని.. ఈ ప్రాజెక్టు కొత్తదని ఏపీ ప్రభుత్వం కోర్టుల్లో కేసులేసి.. ఆఖరుకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవని ప్రాజెక్టును ఆపేసే పరిస్థితికి తీసుకురావ‌డానికి ఈ అసమర్థ నాయకులు కారణం కాదా అని ప్ర‌శ్నించారు.

నీళ్లు ఏపీకి ఇచ్చి.. నిధులను కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరుతో అవినీతి చేసి.. ఉద్యోగాలు ఇంట్లో వారికే ఇచ్చుకున్నార‌ని తీవ్ర‌స్థాయ‌లో ధ్వ‌జ‌మెత్తారు. సొంత బిడ్డల్లాంటి ప్రజల మీద, వారి భవిష్యత్ అవసరాల మీద ఏ మాత్రం కనీస ప్రేమ లేని పాలకుడు కేసీఆరే అని విమ‌ర్శించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న రాయలసీయ లిఫ్ట్ ప్రాజెక్ట్ ను ఆపకుండా.. అన్ని అనుమతులున్న ప్రాజెక్టును నాశనం చేసి.. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి ప్రజల కళ్లలో మట్టికొట్టార‌ని ఫైర్ అయ్యారు.


Next Story