ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 6 సీట్లకు బరిలో 26 మంది

Local body MLC elections polling in Telangana started.తెలంగాణ‌లోని స్థానిక సంస్థ‌ల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2021 4:51 AM GMT
ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 6 సీట్లకు బరిలో 26 మంది

తెలంగాణ‌లోని స్థానిక సంస్థ‌ల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మైంది. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ పోలింగ్ సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఐదు ఉమ్మ‌డి జిల్లాల్లోని ఆరు స్థానాల‌కు మొత్తం 26 మంది అభ్య‌ర్థులు పోటి ప‌డుతున్నారు. మొత్తం 37 పోలింగ్‌ కేంద్రాల్లో, 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మహిళా ఓటర్లు ఉన్నారు. కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్‌ జరు‌గు‌తోంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉండగా.. తొలిసారిగా ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఓటర్లలో ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లే సుమారు మూడొంతుల మందికి పైగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరి పాత్ర కీలకం కానుంది. ఇక పోలింగ్‌ ప్రక్రి‌యను మొత్తం వెబ్‌‌క్యా‌స్టింగ్‌ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల‌ను లెక్కించి అదే రోజు ఫ‌లితాల‌ను వెల్ల‌డించానున్నారు.

- కరీంనగర్‌లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన భార్య ఓటు హక్కును వినియోంచుకున్నారు.

- యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శ్రీమతి గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- నల్లగొండ జిల్లాలోని బాలికల కాలేజ్లో ఎక్స్ అఫిషియో మెంబర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- సంగారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Next Story