స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవం.. స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు

Local body MLC elections kalvakuntla kavitha unanimous. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల

By అంజి  Published on  24 Nov 2021 9:09 AM GMT
స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవం.. స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు

టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత బరిలోకి దిగారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్‌ నామినేషన్‌ దాఖలు చేశాడు. అయితే అతడు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయని నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థిపై ఫోర్జరీ ఆరోపణలు ఉన్నాయని తెలిసింది. కాగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కల్వకుంట్ల కవిత ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుండి మరోసారి బరిలోకి సంగతి తెలిసిందే. సంవత్సరం క్రితం నిజామాబాద్‌ నియోజకవర్గం నుండి కవిత ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా మరోసారి అభ్యర్థిగా దిగిన కవిత ఏకగ్రీవం అయ్యారు. కల్వకుంట్ల కవిత తరపున నాలుగు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే గత బైపోల్‌ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్‌, బీజేపీలు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఇరు పార్టీలు అభ్యర్థుల కోసం చాలానే వెదికారు. అయినా చివరికి ఏ ఒక్కరూ కూడా పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఈ ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు బీజేపీ, కాంగ్రెస్‌లు తెలిపాయి.

తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌ తరఫున ఆర్మూర్‌ నియోజకవర్గం మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థి పోటీ చేయగా ఆయన అఫిడవిట్‌లో తప్పులున్నాయని ఎన్నికల అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు.

Next Story